సాధారణ పుట్టగొడుగులు పెరుగుదల ఎలా ఉంటాయో తెలుసా - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Wednesday 17 November 2021

సాధారణ పుట్టగొడుగులు పెరుగుదల ఎలా ఉంటాయో తెలుసా

Amarapuram  News, Gowdanakunta Amarapuram, natural mushroom.
సాధారణ పుట్టగొడుగుల గురించి తెలుసుకుందాం రండి.

నమస్తే స్నేహితులారా నేను ఈరోజు సాధారణ పుట్టగొడుగుల గురించి వివరించడానికి మీ ముందు వొచ్చాను అయితే ఇవి ఎప్పుడు దొరికాయి మరియు ఎక్కడ దొరికాయి అంటే నేను 11 వ  తేదీన ఉదయం 8గంటలకు మోటర్ పైప్ లను ఎత్తి వేయడానికి Gowdanakunta keremunde కి వెళ్ళాము.

ఇక్కడి నుండి ఉదయం ఏడు గంటల  30 నిమిషాలకి  జీప్ తీసుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళడానికి సుమారు 20 నిముషాలు సమయం పట్టింది.


ఒక్క తోటలోకి  లోపలికి వెళ్ళాం. ఆ బోరెవెల్ ఉన్న చోటు కి జీప్ ని తోలుకొని వెళ్లి అక్కడ ఆపం జీప్ ని. జీప్ నుండి దిగిన తరువాత కొంత సమయం  తరువాత అక్కడ గుంపులు గుంపులుగా  ఉన్నాయి.


మొదటి సారిగా వెళ్ళినప్పుడు ఒక గుంపు లో సుమారు 150 కి పైగా పుట్ట గొడుగులు దొరికాయి. నేను అవి పిచ్చి పుట్ట గొడుగులు అనుకున్న కానీ అవి మంచి పుట్ట గొడుగు అని తరువాత తెలుసుకున్న.

సాధారణ పుట్టగొడుగులు పెరుగుదల ఎలా ఉంటుందో తెలుసా.

ఇవి సంవత్సరం కి ఒకరోజు అదే సమయంలో మరియు అక్కడే పుట్ట గొడుగులు లేస్తాయ్. మన  ఊర్లో, దేవగణపల్లి (Devaganapalli ) లో ప్రజలు మరియు గొర్రెలు కాపారులు ఎక్కువ వీటిని గమనిస్తూ ఉంటారు.

వాళ్ళు ఏమి చేస్తారు అంటే ఎక్కడ అయితే పుట్టగొడుగులు లేస్తాయో ఆ ప్లేస్ లో మళ్ళీ అక్కడే చూస్తారు.

సాధారణ పుట్టగొడుగులు ఎప్పుడైనా వర్షాలు పడే సమయంలో ఇవి ఎక్కువ లేస్తాయ్ కానీ ఇవి సంవత్సరం కి ఒకసారి మాత్రమే లేస్తాయ్.

సాధారణ పుట్టగొడుగులు లేచిన తరువాత ఎంత వరకు బాగుంటాయి

సాధారణ పుట్టగొడుగులు సుమారు 12 గంటల వరకు చెడిపోకుండా చాలా తాజాగా ఉంటాయి. ఒకవేళ 12 గంటలు  దాటితే  వాటికి పురుగులు ఆశిస్తాయి.

ఈ సాధారణ పుట్టగొడుగులు మీకు దొరికిన అనుభవం మీకు ఉంటే కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి.


No comments:

Post a Comment

please do respectful comment

Pages