నా వయసు 26 సంవత్సరాలు నేను ఇప్పటివరకు కనీసం ముప్పై ఇంటర్వ్యూ లకు అటెండ్ అయ్యాను కానీ నేను ఇప్పటికీ కూడా ఉద్యోగం రాలేదు ఏం చేయాలి నేను ఇప్పుడు - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Tuesday, 29 June 2021

నా వయసు 26 సంవత్సరాలు నేను ఇప్పటివరకు కనీసం ముప్పై ఇంటర్వ్యూ లకు అటెండ్ అయ్యాను కానీ నేను ఇప్పటికీ కూడా ఉద్యోగం రాలేదు ఏం చేయాలి నేను ఇప్పుడు

నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ అని అని నాకు తెలుసు బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం శుభోదయం అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం తెలుసుకునే విషయం ఏంటో ఒకసారి చూసేద్దాం రండి.

 మన భారతదేశంలో ఎక్కువగా ఇంజనీరింగ్ చదివి నిరుద్యోగులు చాలామంది ఉన్నారు ఎంత అంటే ఇంతకుముందు ఇంజనీరింగ్ ద్వారా చదివి ఉద్యోగాలు సంపాదించుకుని మంచి జీవితం అనుభవిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు అలాగే ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు మన సమాజంలో.

 ఇప్పుడు మనం తెలుసుకునే పోయే ఒక విషయం ఏంటి తెలుసా ఒకరు...సామాజిక మాధ్యమాలలో ఒకరు ఇలా పోస్ట్ చేశారు అది ఏంటో ఒకసారి చూద్దాం రండి...

My age 26 years.. Attended more than 30 interviews but still no job... I lost the hope what can i do now

 పైన రాసిన విధంగా ఉంది అది ఏంటో తెలుసా ఫ్రెండ్స్ నా వయసు 26 సంవత్సరాలు నేను ఇప్పటివరకు 30 ఇంటర్వ్యూ లకు పైగా అటెండ్ అయ్యాను కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పటివరకు నేను ఉద్యోగంలో సెలెక్ట్ అవ్వలేదు నాకు ఆశ కూడా కోల్పోవడం జరిగింది. ఇప్పుడు నేను ఏం చేయగలను?

 అవును మిత్రులారా పైన రాసిన ఈ కొటేషన్ ని ఒకసారి మనం చదివితే కచ్చితంగా మనకు చాలా బాధ వేస్తుంది ఎందుకంటే అతనికి 26 సంవత్సరాలు అయినాయి అతను ఇప్పటివరకు ముప్పై ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు కానీ అతను ఇక్కడ ఆ 30 ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యాడు కానీ అక్కడ ఏదో ఒక విషయం గురించి మనం నేర్చుకోవాల్సింది ఖచ్చితంగా ఉంటుంది కానీ ఇతను ఎన్ని సార్లు కూడా తెలుగు తెలుసుకో లేక పోతున్నాడు.

 కొన్ని సార్లు మనం ఎంత ప్రయత్నించినా కూడా మనకి అదృష్టం అనే ఒక చిన్న ఇది లేకపోతే మనకి ఏది కూడా మన దగ్గరికి రాదు.

 ప్రస్తుతానికి పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే మనకి అన్ని అర్హతలు ఉన్న కూడా ఉద్యోగం వస్తుందో రాదో అన్న గ్యారెంటీ లేదు ఎందుకంటే ఇప్పుడు పోటీ చాలా ఎక్కువగా ఉంది అందుకే మనం ఏం చేయాలి అంటే ప్రస్తుతం ఉన్న పోటీ లకు తగ్గట్టుగా మన కమ్యూనికేషన్స్ స్కిల్స్ అనే వాటిని అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది.

Unemployment is a big problem in india.....

 మన భారతదేశంలో అన్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఇది ఒక పెద్ద సమస్యగా తయారవుతోంది రోజురోజుకీ దీని నుంచి మనం ఎలా బయట పడాలి అని ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది.

 ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వారిలో వారు చదివేటప్పుడు లక్షల్లో ఫీజులు కట్టి చివరికి ఒక ఉద్యోగం లేకుండా పోతే ఆ బాధ ఎంత ఘోరంగా ఉంటుంది అంటే దాని గురించి వర్ణించలేము అంత ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఒక పక్క తల్లిదండ్రులు వాళ్ళని ఒక మంచి స్థాయిలో వాళ్ల పిల్లలు ఎదగాలని వాళ్లు కోరుకుంటారు కానీ ఆ స్థాయికి పిల్లలు చేరకపోవడం వలన వాళ్ళు చాలా బాధపడుతుంటారు.

 ఆ బాధను చూసి మనం కూడా బాధ పడుతుంటాం. ఎందుకంటే ప్రస్తుతం ఉద్యోగం లేకపోతే ఆర్థిక పరిస్థితుల్లో చాలా దారుణంగా ఉంటాయి అందుకే ఎవరు కూడా ఉద్యోగం లేకుండా ఉంటే వాళ్లకి సమాజంలో విలువ అనేది చాలా తక్కువగా ఉంటుంది.

#Jobs ఉన్నాయా మన భారతదేశంలో.
 ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయా లేదా అనేది ప్రతి ఒక్కరికీ ఒక అనుమానం వస్తుంది ఖచ్చితంగా ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఆ ఉద్యోగానికి తగ్గట్టుగా మనుషులు లేరు.

 సర్టిఫికేట్లు ఉండి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి లేకపోవడం వలన ఎంతోమంది మన భారత దేశంలో నిరుద్యోగం అనే సమస్యతో బాధపడుతున్నారు దానిని నిర్మూలించాలంటే ప్రతి ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని ఏంటో తెలుసా ఎవరు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కచ్చితంగా పెంపొందించుకోవాలి.

No comments:

Post a Comment

please do respectful comment

Pages