పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు నటించిన యువరత్న సినిమా ని చూశారా మీరు - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Saturday, 3 April 2021

పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు నటించిన యువరత్న సినిమా ని చూశారా మీరు

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు నటించిన యువరత్న సినిమా ఎలా ఉందో తెలుసా.

 అవును ఫ్రెండ్స్ మీరు కచ్చితంగా యువరత్న సినిమాని చూడవలసిందే ఎందుకంటే మీరు ఆ సినిమాని చూస్తే కనుక మీ లో ఉన్నా విద్య అభ్యాసం చేస్తున్నప్పుడు మీ లో ఎన్నో గుర్తులు జ్ఞాపకాలుగా గుర్తు గుర్తుకు వస్తాయి.




 yuvaratna లో మీకు నచ్చే కథాంశాలు ఏంటో తెలుసా

 యువరత్న సినిమాలో నాకు నచ్చిన చాలా అంశాలు ఉన్నాయి అందులో మీకు కొన్ని చెప్పాలనుకుంటున్నాను అది ఏంటో తెలుసా మిత్రులారా.

 కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన యువరత్న సినిమా ఏప్రిల్ ఒకటవ తేదీన థియేటర్ల ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే ఇది చాలా చాలా అద్భుతంగా ఉంది.

 ఎందుకు నేను బాగుంది అంటున్నాను అంటే ఈ సినిమాలో ముఖ్యంగా విద్యార్థులు ఎలా చెడిపోతున్నారు అనే దాన్ని క్లియర్ గా ఈ సినిమా ద్వారా చూపించడం జరిగింది డైరెక్టర్ గారు.

 ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్న కొన్ని అంశాలను ఉన్నది ఉన్నట్టుగా ఇందులో చూపించారు మరియు చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను విద్యాభ్యాసం కోసం కాలేజీకి పంపిస్తున్నారు కానీ వాళ్లలో వాళ్లు గుర్తించ లేకుండా ఉంటారు.


 ముందు ప్రతి తల్లిదండ్రులు ఎలా ఆలోచించాలి అంటే మన పిల్లలు ఇందులో ప్రతిభ ఉండాలో ఉన్నారో దాన్ని ఆ ప్రతిభని గుర్తించి వాళ్లకు ఉపయోగపడే శిక్షణ ఇస్తే వాళ్ళు భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదుగుతారు.

 ఇప్పుడు కొంతమందికి సంగీతంలో మంచి ప్రతిభ ఉంటుంది కొంతమందికి క్రీడలలో మంచి ప్రతిభ ఉంటుంది కానీ వాటన్నింటినీ వదిలేసి తల్లిదండ్రులు చదువు చదువు అని ప్రతిసారి విసిగిస్తూ ఉంటారు.

 ఈ అంశాన్ని చాలా క్షుణ్ణంగా ఈ సినిమా ద్వారా వివరించారు.

 యువత ఎలా చెడిపోతుంది అనేదాన్ని యువరత్న సినిమా చూస్తే మీకు కచ్చితంగా అర్థమవుతుంది.


 గురు శిష్యుల సంబంధాన్ని ఇందులో చాలా బాగా చూపించారు దానికి నేర్చుకోవాలి ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ చూసి వాళ్ళ తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు.



No comments:

Post a Comment

please do respectful comment

Pages