ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7వ తేదీ ఎందుకు జరుపుకుంటారు - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Thursday, 7 April 2022

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7వ తేదీ ఎందుకు జరుపుకుంటారు

నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ ని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం గురించి మాట్లాడుకుందాం అయితే ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మనం ఎందుకు జరుపుకోవాలి మరియు దాని ప్రత్యేకత ఏంటి అని మనం తెలుసుకుందాం ఈ రోజు.

 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన జరుపుకుంటారు  కారణం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య సమస్యల పైన అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం గా ప్రకటించింది.

 ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క ప్రత్యేకత ఏమిటి?

 ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రత్యేకత ఏంటి అంటే మన గ్రహం మన ఆరోగ్యం ఆరోగ్యం. ప్రస్తుతం మనం భూమి గ్రహం పైన నివసిస్తున్నాము అనే విషయం అందరికీ తెలుసు కానీ ప్రస్తుతం పర్యావరణ కాలుష్యం కారణంగా భూమి ఆరోగ్యంగా ఉండడానికి వీలు అవ్వడం లేదు.

 కనుక దీని పైన అవగాహన కల్పించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ రోజుని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం గా ప్రతి సంవత్సరం ఏడవ తేదీన జరుపుకుంటుంది.


 ఆరోగ్యం పట్ల మనం ఏం చేయాలి?

 ఆరోగ్యం పట్ల మనం ఏం చేయాలి అని ప్రతి ఒక్కరు కూడా సందేహ పడతారు అయితే ఇప్పుడు మనం మీకు చెప్తాము మీ ఆరోగ్యం గురించి మీరు బాధ్యత వహించాలి. దానితో పాటు చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం గమనించాలి గమనించి దానిని కూడా మంచిగా పట్టుకోవడానికి ప్రయత్నించాలి ఎందుకంటే మనం లోపల ఎంత బాగా ఉన్నా కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం మీకు బాగా లేకపోతే మీరు బాగున్నారా బాగా లేకపోయినా ఒకటే.

 కనుక పర్యావరణం పైన దృష్టి పెట్టాలి. మనం ఎన్నో టీవీ చానల్స్ లోనూ చాలా చోట్ల వింటుంటాం వాతావరణం చాలా దెబ్బతింది మంచు కొండలు కరిగి ఎన్నో సముద్రపు నీటి మట్టం పెరుగుతుందని కూడా మనం న్యూస్ ఛానల్ లో చాలాసార్లు మనం విన్నాం.

 అయితే దానిని మనం ఆచరించాలి ఆచరించిన తర్వాత మనకి అది ఉపయోగ పడుతుంది కనుక ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రతి ఒక్కరు కూడా మీరు పాటిస్తారని అలాగే మీ చుట్టుపక్కల ఉన్న పర్యావరణాన్ని కాపాడుతాం అని మనం ఆశిస్తున్నాం.

No comments:

Post a Comment

please do respectful comment

Pages