నమస్కారం మిత్రులారా అందరు ఎలా ఉన్నారు.నేను చాలా రోజుల తరువాత మీ ముందుకు వొచ్చాను. అందరు బాగున్నరు అని నేను భావిస్తున్నాను.
ఈరోజు నేను పని చేయడానికి నాగేనపల్లి, అమరాపురం వొచ్చాను. ఇక్కడ పచ్చని వేరుశనగ పంట చూసాను ఉదయాన్నే ఇలాంటి వాతావరణం లో చాలా ఆహ్లాదంగా ఉంటుంది.
పల్లెటూరు లో పచ్చని పంటలో వాతావరణం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అంత మంచిగా మరియు అద్భుతంగా ఉంటుంది.
ఈ వేరుశెనగ పంట ఇంకొక నెల ఆఖరికి పంట వొచ్చే దశలో ఉంది మరియు ఇది సెప్టెంబర్ మాసం లో వేశారు అని నా బావన.
ఇప్పుడు వేరుశనగ పంట పెట్టిన రైతులు నిజంగా అదృష్టవంతులు అనే చెప్పాలి. వేరుశెనగ పంట అంటే మంచి గిరాకీ ఉన్న వాణిజ్య పంట అనే చెప్పాలి.
ఈ వేరుశెనగ పంట కి మార్కెట్ లో కనీస ధర 5000 నుండి 7000 వరకు ఉంది. ఒక ఎకరానికి సుమారు 20 క్వింటల్ నుంచి 30 క్వింటల్ దిగుబడి వస్తుంది.
అందుకే ఈ పంట ని వర్ష కాలం ఎండ కాలం అని చూడకుండా వేస్తారు
No comments:
Post a Comment
please do respectful comment