నగరంలో మరియు పట్టణ ప్రాంతంలో కూరగాయలు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి మనం వాటి అవసరం లేకుండా మనమే తాజా కూరగాయలు పండించవచ్చు.
అది ఎలా అంటే మీకు తెలుసా పట్టణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూరగాయలు కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఆ కూరగాయలు కూడా బాగుండవు కొన్నిసార్లు కానీ మీరు టెర్రస్ గార్డెన్ లో మీరు కూరగాయలు మిరే స్వయంగా పండించవచ్చు.
టెర్రస్ గార్డెన్ కి కావాల్సిన వి
టెర్రస్ గార్డెన్ కి కావాల్సిన వాటి గురించి తెలుసుకుందాం రండి. దానికి ఎక్కువ స్థలం అవసరం లేదు మరియు మీరు స్థలం కోసం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు.
మీ ఇంటి బాల్కనీ లో మరియు ఇంటి పైన మీరు చాలా చెట్లు పెడుతుంటారు కానీ వాటికి బదులుగా మీరు ఆ స్థలం లో కూరగాయలు మొక్కలు నాటితే మీకు ఉపయోగంగా ఉంటుంది.
టెర్రస్ గార్డెన్ లో ఎలాంటి మొక్కలు నాటవచ్చు
టెర్రస్ గార్డెన్ లో మీరు ఎలాంటి కూరగాయలు పండించవచ్చు అంటే కింద ఉన్న వాటి ని నాటవచ్చు
టమోటా మొక్కలు
వంకాయ మొక్కలు
ఆకు కూరలు
ఆలుగడ్డ
ముల్లంగి
ఇంకా చాలా రకాల కూరగాయలు కి సంబందించిన మొక్కలు నాటుకోవచ్చు.
మొక్కలు నాటుకొనే విధానం :-
మీరు మొక్కలు ఎలా నాటుకోవాలి అంటే ముందుగా మంచి మట్టిని తీసుకొని ఏదైనా బాక్స్ లో కానీ కాళీ అయిపోయిన సిమెంట్ సంచి ని రెండు భాగాలుగా కోసుకొని అందులో మట్టి ని నింపాలి.
మట్టి ని నింపుకున్న తరువాత మీకు కావాల్సిన మొక్కలు అందులో నాటలీ తరువాత వాటికి నీళ్ళు అందించాలి.
అప్పుడప్పుడు మనం ఎప్పుడు కూడా వాటిని గమనిస్తూ ఉండాలి. మొక్కల పెరుగుదల ని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి.
పైన చిత్రం లో చుడండి స్వీట్ పొటాటో మరియు సబ్బాక్షే సోప్పు ని అందులో వేయడం జరిగింది.
పైన వేసిన కూరగాయలు అన్ని 45 రోజులు లో లోపు వొచ్చే కూరగాయలు మాత్రమే ఎందుకంటే ఇంకా ఎక్కువ రోజులకి వొచ్చే పంటలు వేయకూడదు.
No comments:
Post a Comment
please do respectful comment