Movie Artist Association ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారు??? - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Monday, 21 June 2021

Movie Artist Association ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారు???

నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ అని అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారు అని నేను అనుకుంటున్నాను ఈ రోజు మనం ఒక విషయం పైన తెలుసుకో పోతున్నాను అది ఏంటో తెలుసా తెలుగు సినిమా పరిశ్రమలో ఎలక్షన్లు జరుగుతున్నాయి.

 అవును మిత్రులారా మనకి నార్మల్గా రాజకీయాలలో మరియు ప్రభుత్వం అలాంటి ఎన్నికలు ఎలా జరుగుతాయో అలా విధంగానే మన తెలుగు సినీ పరిశ్రమలో కూడా సినీ కళా జనాలకు కూడా ఒక ఎన్నికలు జరుగుతాయి.

 తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు చాలా మంది ఇప్పటివరకూ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షునిగా చాలామంది పని చేయడం జరిగింది ఇంతకుముందు ఎవరైతే పని చేశారో చూద్దాం రండి శివాజీరాజా మరియు నరేష్.

 ఇంకా చాలామంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొంది వాళ్ళు మూవీ ఆర్టిస్టులకు ప్రెసిడెంట్ గా ఉండడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఇక్కడ ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.

 ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఎన్నికల లో ఎవరు అభ్యర్థులుగా నిలబడుతున్నారు తెలుసా. అభ్యర్థులుగా ప్రకాశ్ రాజ్ మరియు మంచు విష్ణు ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తా ఉన్నారు ఇందులో ఎవరు గెలుస్తారు అనేది చాలా అద్భుతంగా ఉంది ఇప్పటికే అన్ని సన్నాహాలు పూర్తి అయినాయి ఎన్నికలు జరుగుతాయి త్వరలోనే.

 ఇందులో ఎవరైతే గెలవడానికి అవకాశం ఉంటుంది అంటే ఎవరైతే మూవీ ఆర్టిస్ట్ సంక్షేమాన్ని కార్యక్రమాన్ని ఎవరైతే చేపడతారో వాళ్ళకి ఎక్కువగా ఇందులో ఎన్ని కావడానికి అవకాశం ఉంటుంది.

 ప్రకాష్ రాజు గారు గొప్ప నటులు ఆయన ఒక భాషలో కాదు అన్ని భాషలలో కూడా నటించగల గొప్ప నటుడు.ఇప్పుడు ఆయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడ్డారు ఆయనకు మద్దతుగా నాగబాబుగారు కూడా తెలిపారు.

 అయితే కొంత మంది నెటిజన్లు ప్రకాష్ రాజు మన స్థానిక వ్యక్తి కాదు అని కొందరు నెగిటివ్గా చెప్పుకుంటున్నారు మరికొందరు అయితే స్థానిక వ్యక్తి అయినటువంటి మంచు విష్ణు గారిని ఎన్నుకోవాలని ఇంకొంతమంది అభిప్రాయాలను చెబుతున్నార

 అయితే ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు అధిక త్వరగానే జరుగుతాయి. అధ్యక్ష పదవికి ఎవరు ఎన్నిక అవుతారు అనేది మనకి అతి త్వరలోనే తెలిసిపోతుంది అంతవరకూ వేచి ఉందాం.

No comments:

Post a Comment

please do respectful comment

Pages