narsapur lake
narsapur road and narsapur lake photos.
నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నేను ఒక అద్భుతమైన విషయాన్ని మీ ముందుకు చర్చించడానికి రావడం జరిగింది. మీరు చాలా ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అవుతుంటారు అది ఏమయి ఉంటుంది.
ఇక్కడ మనకి బెంగళూరుకి సమీపాన చాలా ఇండస్ట్రియల్ ఏరియా అంటే పారిశ్రామిక స్థలాలు ఎక్కువగా ఉన్నాయి. బెంగళూరుకు నాలుగువైపులా అంటే తూర్పు ఉత్తర దక్షిణ పడమర అన్ని వైపు సుమారు నలభై యాభై కిలోమీటర్ల దూరంలో చాలా చాలా పరిశ్రమలు ఉన్నాయి.
వీటిలో పెద్ద తరహా పరిశ్రమలు,చిన్న తరహా పరిశ్రమలు,మధ్య తరహా పరిశ్రమలు చాలా ఉన్నాయి.మనం ఇలా బెంగళూరుకి గ్రామీణ ప్రాంతం లోనూ మరియు అర్బన్ ప్రాంతంలోనూ చాలా పరిశ్రమలు మరియు కంపెనీలు ఉన్నాయి.
మనం వీటన్నిటిని పక్కన పెడితే గనుక మనకు బెంగళూరు లో చూడవలసిన స్థలాలు చాలా ఉన్నాయి చారిత్రక స్థలాలు కావచ్చు చారిత్రక కట్టడాలు ఇంకా మరెన్నో స్థలాలు ఉన్నాయి మనం ఆనందంగా గడపడానికి కావలసిన అన్ని స్థలాలు చాలా ఉన్నాయి.
మిత్రులారా నా గురించి చెప్పాలంటే నాకు ఎక్కువగా ప్రయాణించడం మరియు కొత్త కొత్త స్థలాలను వీక్షించడం అంటే నాకు చాలా ఇష్టమైన పని నేను ఎక్కువగా ట్రావెలింగ్ లోనే ఉంటాను.
ప్రస్తుతం నేను ఎక్కడ పోవడం లేదు ఈ కారణం జాబ్ కారణంగా ఎక్కడ పోలేని పరిస్థితి లో ఉన్నా. కానీ అప్పుడప్పుడు మాత్రం చాలా ప్రయాణిస్తూ ఉంటాను.
దీని గురించి ఎందుకు లేండి కానీ ఇప్పుడు నేను ఒక కొత్త అద్భుతమైన ప్రదేశం గురించి మీకు వివరించాలని అనుకుంటున్నాను.
మీకు నర్సాపూర్ అంటే వినే ఉంటారు కదా చాలా మంది ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే చాలా పరిశ్రమలు అక్కడ నెలకొల్పబడ్డాయి కాబట్టి అక్కడికి చాలా మంది కార్మికులు మరియు ఉపాధి కోసం ఎంతో మంది కొన్ని వేల మంది ఇక్కడ వచ్చి పనిచేస్తుంటారు దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి ఉపాధి పొంది చాలా అభివృద్ధి పొందిన మనుషులు ఇక్కడ చాలా మంది ఉన్నారు.
ఇది ఎప్పటి అనుభవం చెప్తూంటే ఇదే సంవత్సరం లోనే అక్టోబర్ 14వ తేదీ నేను నర్సాపూర్ కి వెళ్లడం జరిగింది అక్కడ నేను చూసిన ప్రకృతి సౌందర్యాన్ని చిత్రీకరించి బంధించి మీ ముందుకు ఇక్కడికి వచ్చాను.
ఇక్కడ చాలా ప్రకృతి సౌందర్యం చాలా అద్భుతంగా ఉంది నేను చెప్పాలంటే అక్కడ ఒక చెరువు ఉంది నర్సాపూర్‌లో ఒక చెరువు ఉంది ఆ చెరువు గురించి చెప్పడానికి నాకు లేవు మరియు వర్ణించడానికి అక్షరాలు లేవు అని చెప్పగలను ఎందుకంటే.
అంత అద్భుతంగా ఉంది. ఇది నర్సాపూర్ చెరువు అనేది ఎక్కడ ఉందో తెలుసా మీకు.నర్సాపూర్ అనే గ్రామం బెంగళూరు నుండి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఇక్కడ ఎక్కువ పరిశ్రమలు మరియు ఎన్నో ఫ్యాక్టరీలు ఇక్కడ నెలకొల్పబడ్డాయి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.
ఈ చెరువు ని చూడగానే నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఈ చెరువు చుట్టూ పచ్చని పొలాలు మరియు ఇంకా మరెన్నో అద్భుతమైన దృశ్యాలు మనం చూడగలం అక్కడికి వెళితే కనుక.
ఈ నర్సాపూర్ అనే గ్రామం ముఖ్యంగా కోలార్ జిల్లా మరియు బెంగళూరు కి మధ్యలో ఉంది. ఈ గ్రామం ఎన్నో అంతర్జాతీయ తయారీ కంపెనీలు ఇక్కడ నెలకొల్పబడ్డాయి.
ఇక్కడి దృశ్యాలు చూసి నాకు చాలా ఆనందం వేసింది మరియు ఆశ్చర్యం కూడా వేసింది ఎందుకంటే ఇక్కడ అద్భుతంగా ఉంది.
నేను వెళ్ళినప్పుడు ఓల్డ్ మద్రాస్ రోడ్ కి ఇటువైపు చెరువు ఉంది అంటే మనం బెంగళూరు నుంచి పోయేటప్పుడు ఇది ఎడమ వైపుకి వస్తుంది వచ్చేటప్పుడు కూడా నుంచి వచ్చేటప్పుడు ఈ చెరువు అనేది కుడివైపు వస్తుంది ప్రతి ఒక్కరూ ఇక్కడ వస్తుంటారు.
నాకు ఒక అనుమానం ఉంది ఈ చెరువు ఒక మంచినీటి చెరువు లేక నార్మల్ అంటే సాధారణమైన చెరువు అనేది నాకు తెలియని పరిస్థితి.
అందుకే నేను ఎక్కువగా ఇలాంటి ప్రదేశాలను ఎక్కువగా వీక్షించడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను ఎందుకంటే నాకు నచ్చదు అందుకే కొంచెం డిఫరెంట్ గా ప్రయత్నించాలని నేను అప్పుడప్పుడు ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం ఫలితమే ఈ నర్సాపూర్ చెరువు అనుకోండి.
ఇది జాతీయ రహదారి పక్కన ఉండటం ఇది ఒక చెప్పుకోదగ్గ విషయం. రోజుకి కొన్ని వేల వాహనాలు ఇక్కడ రాకపోకలు జరుగుతూ ఉంటాయి. ఇది ఈ రహదారి వచ్చేసి ముంబైకి వెళ్లే వాహనాలు మరియు చెన్నై వెళ్లే వాహనాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి.
దేశం నలుమూలల నుంచి ఎక్కడినుండి ఎక్కడికో రవాణా జరుగుతూ ఉంటుంది చెప్పుకోవాలంటే.
ఈరోడ్ లో అంటే ఈ జాతీయ రహదారి లో ప్రయాణించేటప్పుడు నర్సాపూర్ చెరువు అనేది బాగా అద్భుతంగా అందంగా కనిపిస్తుంది.
Narsapir
ReplyDelete