Best YouTube Channels In Amarapuram - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday, 4 December 2020

demo-image

Best YouTube Channels In Amarapuram



InShot_20201205_081241863


నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఇంకొక మంచి వార్త తో మీ ముందుకు రావడం జరిగింది అది ఏంటి తెలుసా మీకు చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంటుంది మనం మన ప్రాంతాలలో చాలా వెనుకబడిన ప్రాంతంగా పిలవడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ తగిన సదుపాయాలు లేకపోవడం దీనికి కారణం అయి ఉండవచ్చు కానీ ఇప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంది.

 దానికి కారణం చాలా మంది విద్యావంతులు కావడం తగిన మంచి మంచి స్థాయిలో ఉద్యోగాలు పొందడం వీటికి నిదర్శనం.

 ఇంతకు ముందు విద్యా మరియు వాటి ఉపయోగం పైన అవగాహన లేకపోవడం వలన చాలా మంది నిరక్షరాస్యులుగా ఉండడం మన అమరాపురం లో చాలా మందిని చూశాం.

 మన అమరాపురం మండలం లో చాలామంది ప్రతిభ గల వారు ఉన్నారు. కానీ ఆ ప్రతిభను ఎలా  ప్రదర్శించు కోవాలి అని తెలియక కొంత మంది చాలా వెనుకడుగు వేస్తుంటారు అలాంటి వాళ్ళ దారిలో వెళ్లకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

 ఆ ఇద్దరు వ్యక్తుల గురించి మరియు వాళ్ళు ప్రారంభించినా ఆ యూట్యూబ్ ఛానల్ గురించి ఈ రోజు తెలుసుకుందాం రండి.

 Best YouTube channels In Amarapuram :
  1. Vishwa Ninganna
  2. Sunami Siva
 ఈ ఇద్దరు వ్యక్తులు చాలా ప్రతిభావంతులు. ఎదుటివారికి ఆలోచించకుండా సహాయం చేసే గుణం వంతులు.


Vishwa Ninganna  YouTube Channel :
 విశ్వా నింగన్న  యూట్యూబ్ ఛానల్  ని ప్రారంభించడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది.

 మన అమ రాపురం లో చాలామంది మన విద్యా వ్యవస్థ పైన అవగాహన చాలా మందికి లేదు.పేద విద్యార్థులకు మరియు విద్యా వ్యవస్థ పైన అవగాహన లేని వాళ్ళకి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని ఉపయోగపడే విషయాల గురించి అవగాహన పరచడానికి ఈ యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించారు.

 ఈ విశ్వం నింగన్న యూట్యూబ్ ఛానల్ ఓనర్ విశ్వ.ఈయన దేవ గాన హోలీ అమరాపురం మండల్ అనంతపురం జిల్లాలో జన్మించారు.
 ఆయన ఇక్కడే అనంతపురం జిల్లాలో డిగ్రీ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తిచేశారు.

 విశ్వా లింగన్న అనే యూట్యూబ్ ఛానల్ ని డిసెంబర్ 4వ తేదీన ప్రారంభించారు ఇప్పటివరకు వాళ్ళకి subscribe 167 మంది చేశారు.

 ఆయన ఇప్పటివరకు రెండు వీడియోలను అప్లోడ్ చేయడం జరిగింది కానీ ఇప్పటికీ చాలా మంచి స్పందన రావడం చాలా గమనించదగ్గ విషయం.


Sunami Shiva YouTube Channel :

 అమరాపురం మండలం లో సునామీ శివ అనే పేరుని చాలామంది వింటూ ఉంటారు ఆ పేరు ఎందుకు ఇలా ప్రఖ్యాతిగాంచింది అని చెప్పాలంటే మీకు ఆయన ఒక మంచి మంచి డాన్సర్.

 ఇంతకుముందు టిక్టాక్ ఉన్నప్పుడు చాలా మంచి ప్రతిభ కనబరిచి వాళ్ళు చాలా మందిని ఆయన అభిమానులుగా మార్చుకోవడం జరిగింది.

 సునామీ శివ కూడా ఒక మంచి యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించారు.

 ఇతను అమలాపురం లో ఫస్ట్ ఇంత ముందే ఛానల్ ని ప్రారంభించారు. కానీ ఆయన ఆశించిన స్పందన రాకపోవడంతో ఒక గమనించదగ్గ విషయం.

 మిత్రులారా ఈ రెండు ఛానల్స్ అమలాపురానికి చెందిన వి కావున ఈ ఛానల్స్ చాలా మంచి ప్రాచుర్యం పొంది. మన అమలాపురం లో ఉన్న వాళ్లకి ఈ ఛానల్స్ ద్వారా ఒక మంచి సేవను అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.


 ఈ రెండు ఛానల్స్ కి ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు అవుతుంది కచ్చితంగా  చేస్తారు


No comments:

Post a Comment

please do respectful comment

Pages