రాయదుర్గం తుముకూరు రైల్వే ప్రాజెక్టు ఎంత వరకు వచ్చిందో చూద్దాం రండి - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday 16 July 2021

రాయదుర్గం తుముకూరు రైల్వే ప్రాజెక్టు ఎంత వరకు వచ్చిందో చూద్దాం రండి

నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ అని అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను మీరు కూడా బాగానే ఉంటారు అని నేను అనుకుంటున్నాను ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా.

 ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనంతపురం జిల్లాలో ఎక్కువగా రైల్వే ట్రాక్ గాని రైలు నడవడం గాని ఎక్కువగా ఉండదు ఎందుకు అంటే ఇది చాలా కరువుతో ఉన్న ప్రాంతం ఇక్కడ కొంచెం వెనుకబడటానికి కారణం కూడా ఇదే అనుకోవచ్చు.

 ఈ వెనుకబడిన జిల్లాలో ఒక రైల్వే లైను ప్రాజెక్టుని కొన్ని సంవత్సరాల ముందు రైళ్లు నడపాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాయదుర్గం నుండి కళ్యాణదుర్గం కంబదూరు మరియు పావగడ మడకశిర మదిగిరి వీటిని అనుసంధానం చేస్తూ తుంకూరు కి కలపాలని భారత ప్రభుత్వం నిర్ణయించి ఒక ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది.


 ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడి వరకు రైల్వే ట్రాక్ ని వేశారు అంటే రాయదుర్గం నుండి కళ్యాణ్ దుర్గం మీదుగా కంబదూరు మరియు కదిరిదేవరపల్లి వరకు ఈ రైల్వే లైను నిర్మించబడింది ఇంకా ఇంకా పావగడ మరియు మడకశిర మదిగిరి నుండి తుముకూరు వరకు రైల్వే ట్రాక్ ని నిర్మించాల్సిన అవసరం ఉంది.

 ప్రస్తుతానికైతే కదిరిదేవరపల్లి నుంచి తిరుపతి కి ఒక పాసింజర్ ట్రైను ప్రస్తుతం నడుస్తోంది.

 రాయదుర్గం నుంచి తుముకూరు వరకూ రైల్వే ట్రాక్  వేసవి కనుక చాలా లాభాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఇక్కడినుంచి వేరే రాష్ట్రాలకు ట్రైన్లో ప్రయాణించాలి అంటే సుమారు ఒక వంద కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి మనకి రైల్వే స్టేషన్లు.

 అందుకే ఇక్కడ మన ప్రాంతంలో వచ్చి ఎక్కువగా రైల్వే సదుపాయం లేకపోవడం మనందరికీ బాధాకరమైన విషయం.

 ఇప్పుడు రాయదుర్గం నుంచి తుంకూర్ వరకూ రైల్వే లైను నిర్మించడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రయాణికులు ఎక్కువగా దూరం వెళ్లకుండా మనకి అందుబాటులోనే ఈ ట్రైన్లో ప్రయాణించడం ద్వారా మనకి చాలా సమయం ఆదా అవుతుంది.

 ఈ రైల్వే లైను నిర్మించడం వలన వెనుకబడిన ప్రాంతాలు అయినటువంటి కళ్యాణదుర్గం మరియు మడకశిర చాలా పట్టణాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది మరియు ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ రైల్వే లైన్ వల్ల.


1 comment:

please do respectful comment

Pages