Lockdown dairy Day -1 - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Wednesday 5 May 2021

Lockdown dairy Day -1

Lockdown dairy Day-1

 నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ అని అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈ రోజ మనం ఏం చేస్తున్నాం అనేదాని గురించి తెలుసుకుందాం రండి.


 ప్రస్తుతం మన ఇండియాలో చాలా దారుణంగా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి మరియు మరణాలు కూడా సంభవిస్తున్నాయి దానికి మనం ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు ఎలా ఎవరిని అటాక్ చేస్తుందో ఎవరికీ తెలీదు.

 అందుకే మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మనకు.ఇప్పుడు పట్టణాల నుంచి పల్లెల దాకా ఎక్కడ చూసిన కరోనా కేసులు ఉన్నాయి.

 ఇప్పుడు మనకి లాక్ డౌన్ ఉన్నా కూడా నేను రోజు పనికి వెళుతూ.పనికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను మాస్క్ ధరించడం మరియు శానిటైజర్ వాడడం మరియు సామాజిక దూరం పాటించడం ఇవి అందరూ పాటించవలసిన మూడు నియమాలు.


 నేను ఈరోజు ఉదయం ఐదు గంటలకి నా పని ముగించుకొని రూమ్ కి వచ్చి ఇక్కడ ఒక ఆరు చపాతీలు తయారుచేసే తర్వాత అందులో కి కావాల్సిన కర్రీ తయారు చేసే సరికి ఉదయం 8 గంటలు అయింది.

 ఇప్పుడు మాకే రాత్రి పని ఉండడం వలన 8:30 నుంచి ఉదయం 5 30 నిమిషాల వరకు ఉంటుంది పని.ఈరోజు మనకి వీక్ ఆఫ్ కావడం వలన ఈ రోజంతా చాలా జాగ్రత్తగా రూమ్ లోనే ఉండాలి.

 రూమ్ లో కూడా మార్చుకుని ధరించడం చాలా ముఖ్యమైన విషయమని నాకు కొంచెం అర్థమవుతుంది.ప్రస్తుతం ఎవరు కూడా నిర్లక్ష్యం చేయడం చాలా తప్పు.

 ఇంకొకటి చెప్పదలచుకుంది ఏంటి అంటే మనం ఎప్పుడూ కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల కి దూరంగా ఉంటే మంచిది ఎందుకంటే అందులో చాలా భయంకరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.



No comments:

Post a Comment

please do respectful comment

Pages