నమస్కారం మిత్రులారా రేపు కదా ఉగాది పండుగ ఉగాది పండుగ గురించి నాకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను మీతో నేను పంచుకోవడానికి ఈ రోజు రావడం జరిగింది.
ప్రతి సంవత్సరం ఉగాది పండుగ వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ వేపాకు మరియు మామిడి ఆకులు తోరణం మామిడి పచ్చడి చేసుకుని అందరూ సుఖసంతోషాలతో పండుగ చేసుకుంటూ ఉంటారు.
కానీ నాకు మాత్రం ఎప్పుడూ నేను ఉగాది పండుగను జరుపుకోవడం లేదు ఎందుకో తెలియదు నాకు జరుపుకోవాలని కూడా ఆనిపించలేదు.
అందుకోసమే నేను కానీ ప్రతి సంవత్సరం 2015 నుండి నేను ఉగాది రోజున కాంచీపురం వెళ్లి అక్కడ కామాక్షి దేవాలయం లో కామాక్షి దర్శనం చేసుకొని ప్రతి సంవత్సరం ఉగాది రోజున వెళ్లి దర్శనం చేసుకుని వచ్చేవాడిని.
అప్పుడు నేను కనకమ్మ సత్రం(kanakamma sathram ) లో ఉండేవాడిని 2015 నుండి 2017 ఏప్రిల్ వరకు అక్కడే నేను ఉన్నాను ఆ అక్కడ ఉన్నన్ని రోజులు ప్రతి సంవత్సరం ఉగాది రోజున నేను కాంచీపురం తప్పకుండా వెళ్లేవాడిని.
ఎందుకో తెలీదు అక్కడికి వెళ్ళినప్పుడు నా మనసు చాలా మనశాంతి గా ఉన్నట్టు అనిపించింది అందుకే నేను ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజు నేను కంచి కామాక్షి దేవాలయం లో కొంత సేపు కూర్చొని వచ్చేవాడిని.
మూడు సంవత్సరాలు అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్లేవాడిని కానీ 2017 నుండి అక్కడికి వెళ్ళడానికి కుదర లేదు అందుకే ఈ రోజు నాకు రేపు ఉగాది కాబట్టి నాకు ఈరోజు చాలా జ్ఞాపకం వచ్చింది అందుకే నేను మీతో దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను.
రేపు ఉగాది పండుగ సందర్భంగా వెళ్లాలి అనుకున్నాను కానీ వెళ్లడానికి కుదరదు అందుకే ఆ జ్ఞాపకాన్ని ఇప్పుడు మీతో ఇలా షేర్ చేసుకోవాల్సి వచ్చింది.
ఈ ఆర్టికల్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలపండి
No comments:
Post a Comment
please do respectful comment