January 1st Trip "Dhakshina Kaashi Punyakshethra Antharagange Kolar - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday 1 January 2021

January 1st Trip "Dhakshina Kaashi Punyakshethra Antharagange Kolar

మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు... అందరూ బాగున్నారు అని అనుకుంటున్నానో ఎందుకంటే ఇది కొత్త సంవత్సరం అంటే పోయిన సంవత్సరం 2020లో మనం ఎదుర్కొంటున్న సమస్యలు 12 చాలా సమస్యలు... అలాంటి సమస్యలను సైతం మనం మనం దాటుకొని 2020 వ సంవత్సరాన్ని దాటు కున్నాము. మనం పోయిన సంవత్సరం లో ఎదుర్కొన్న సమస్యలు ఈ సంవత్సరంలో ఎదుర్కోకుండా తగిన చర్యలు తీసుకుంటామని మనమే హామీ ఇస్తున్నాము.

 మిత్రులారా అందరూ కొత్త సంవత్సరాన్ని ఒక పండగలా జరుపుకొని ఆ రాబోయే సంవత్సరాన్ని ఆహ్వానించారు. చాలా ఘనంగా కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడం జరిగింది. ఇక్కడ చాలామంది కొత్త సంవత్సరం ఒక పండగలా జరుపుకోవడానికి చాలా ఖర్చు పెడుతున్నారు.

 ఎందుకంటే ఇది సంవత్సరంలో ఒకసారి మాత్రమే వస్తుంది కనుక అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ తోచినంత డబ్బును తీసుకొని చాలా సంతోషంగా జరుపుకున్నారు.


 ఈ కొత్త సంవత్సరం శుభ సందర్భాన చాలామంది దేవాలయాలకు వెళ్లి దర్శనం చేసుకోవడం మరియు ఇంకొంతమంది అయితే చర్చిలకు వెళ్ళి ప్రార్థనలు నిర్వహించడం ఇలాంటి కొత్తకొత్త మరియు చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

 అందరూ చాలా మంది దేవాలయాలకు వెళ్లి దేవుణ్ణి దర్శించారు. ఈ 2021 సంవత్సరం సందర్భంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని నాకు కూడా చాలా ఆసక్తికరంగా ఉంది అందుకోసమే నేను ఏదో ఒక గుడిని సందర్శించాలని దర్శనం చేసుకోవాలని అని నిర్ణయించుకున్నాను అందుకు తగ్గట్టుగానే నేను "Dhakshina Kaashi Punyakshethra  Antharagange  Kolar".కి వెళ్లడం జరిగింది.


ఈ దేవాలయం గురించి చెప్పాలంటే ఇది దక్షిణ భారతదేశంలో చాలా ప్రముఖమైన దేవాలయం.
 ఈ దేవాలయానికి మరొక పేరు ఉందండి అది ఏంటి అంటే దక్షిణ కాశి అని కూడా పిలుస్తారు.

 ఈ దేవాలయం బెంగళూరు నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.. కోలార్ నుంచి అయితే రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. కాశీ విశ్వనాథ్ ఈశ్వర దేవాలయం ఇక్కడ ఉంది. దీని వలన ఈ దేవాలయానికి అంటే అంతర గంగే అనే పేరుంది...

 అందుకే మన భారతదేశంలో కాశీ తర్వాత ఈ దేవాలయాన్ని దక్షిణ కాశి అని కూడా పిలుస్తారు చాలా మంది భక్తులు చాలా వస్తుంటారు.


 మిత్రులారా దాన్ని పాతాళగంగ అని కూడా అంటారు లేకపోతే మరియు అంతర గంగే అంటారు..ఇక్కడ శివుని ఆలయం చాలా ప్రఖ్యాతి గాంచింది మరియు ప్రముఖమైనది ఇక్కడికి శివుని దర్శనం కోసం చాలా ఎక్కువగా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు.

 ఇక్కడ మీకు ఒక విషయం తెలుసా మీరు పైన చూస్తున్న దేవాలయం అంటే నీటి మధ్యలో ఉన్న దేవాలయానికి ఎదురుగా అంటే ఎదురుగా ఉన్న ఒక బసవన్న విగ్రహంలో నుంచి నీళ్లు బయటికి రావడం జరుగుతుంది ఆ నీళ్లను మన భక్తులు చాలా భక్తితో తీర్థం లా పుచ్చుకుంటారు... అలా తీసుకుంటే మంచి జరుగుతుంది అని వాళ్ళ నమ్మకం.



 మిత్రులారా మీరు నన్ను క్షమించాలి ఎందుకంటే అంతర గంగే లో శివుని దేవాలయం చాలా ప్రముఖమైనది మరియు ప్రఖ్యాతి గాంచినది అది కొండపైన ఉండడం వలన నేను అక్కడికి వెళ్ళలేకపోయాను అందుకే నేను అదే చెప్తున్న కాశీ విశ్వనాథ దేవాలయం దక్షిణ కాశీగా ఇక్కడ పిలుస్తుంటారు అంతరంగాన్ని నేను అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి జరిగింది అంటే కొంత సమయం లేకపోవడం వలన నేను మళ్ళీ వెనక్కి రావడం జరిగింది శివుని శివుని దేవాలయం నేను దర్శనం చేసుకోలేకపోయాను నన్ను క్షమించండి.

 ఇలానే మీరు మరికొన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మీరు మీ ఈ మెయిల్ ద్వారా మా బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి.


2 comments:

please do respectful comment

Pages