వర్షం ఎక్కువగా రావడం వలన వరి పంట పొలంలో చేరిన నీళ్లు - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday 19 November 2021

వర్షం ఎక్కువగా రావడం వలన వరి పంట పొలంలో చేరిన నీళ్లు

అమరాపురం న్యూస్ అప్డేట్ :-

 నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ అని అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకోబోయే విషయం ఏంటంటే ఈ కొన్ని రోజుల నుంచి వర్షం భారీగా వస్తోంది అందుకు కారణం తుఫాను సంబంధించినది కాబట్టి వర్షం ఎక్కడ ఆగకుండా వస్తుంది పంటలు దెబ్బతింటున్నాయి మరియు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

 నిన్నటి నుంచి వర్షం పడుతూనే ఉండడం వలన ఇక్కడ మధ్యలో విరామం లేకుండా వర్షం వస్తుంది చాలా చోట్ల ప్రాంతాలు జలమయం అయ్యాయి కూడా ఈ వర్షం ఆగడం లేదు.

 దీనికి కారణం బంగాళాఖాతంలో సంభవించిన అల్ప పీడనం ఎక్కువగా ఉండడం వలన ఇది వర్షం గా వస్తుంది మరియు విరామం లేకుండా పడుతుంది వర్షం చాలా చోట్ల మొత్తం జలమయం  చేసింది.

 ఇప్పుడు నేను వరి పంట పొలంలో నీళ్లు మొత్తం చేరాయి వాటిని ఎలా బయటికి తియ్యాలి మరియు ఎలా చేయాలి అనేది చాలా దిగ్భ్రాంతికి గురి అవుతుంది.

 ఎందుకంటే ఇన్ని రోజులు మా కష్టపడినా పంట ఇప్పుడు చేతికి వచ్చే సమయానికి ఇలా చేయడం అందరికీ బాధ కలిగిస్తుంది మరియు వీటికి పరిష్కారం ఏం చేద్దాం చూద్దాం అనిపిస్తుంది ఎందుకంటే ఇది వర్షం ఆగే వరకు మనం ఏమి చేయలేము మరియు అందులోకి వెళ్ళలేము కూడా.

 అక్కడ చూస్తున్నారు చూడండి మొత్తం ఈరోజు ఉదయం నుంచి వర్షం విరామం లేకుండా వస్తుంది అందుకే ఇక్కడ వరి పంట పొలంలో నీళ్లు వాటిని బయటికి తీయడానికి చాలా కష్టం అవుతుంది మనం ఏం చేయాలి అనేది మనకి తోచడం లేదు ఇలా ఇక్కడే కాదు ఒక Amarapuram లోనే కాదు చాలా ప్రాంతాలలో పరిస్థితి చాలా విషమంగా ఉంది.

 చాలా ఘోరంగా ఉంది పరిస్థితి అయితే మనం ఏం చేయాలి. కొన్ని రోజులు ఆగి పంటని కొయ్యాలి అంటే అప్పటికి వరి గింజలు మొత్తం కింద నేలపాలు అయి ఉంటాయి.

 ఒక పక్కన వర్షం ఇలా వస్తుంటే ఈ పంట కి ఒక పక్కన పక్షుల బెడద ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ విత్తనాలను తినడానికి పక్షులు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎందుకంటే ప్రస్తుతానికి వాటికి కూడా ఇక్కడ ఆహారం అందడం లేదు అందుకే అవి వీటిపైన పడతాయి మరియు ఈ పంటను తింటాయి.

 వీటి నుండి కూడా మనం కాపాడుకోవాలి ఉంటుంది ఎందుకంటే పక్షులు ఉదయం 6 గంటల నుండి ఎన్ని గంటల వరకు వస్తూనే ఉంటాయి మరియు సాయంత్రం ఐదు గంటల నుండి 7 గంటల వరకు ఇక్కడే ఉంటాయి అవి ఎక్కడ మనం ఈ సమయంలో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది వాటిని ఇక్కడికి చేరకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.


No comments:

Post a Comment

please do respectful comment

Pages